ఎదులాపురం,ఏప్రిల్ 9: ఓసీల సంక్షేమానికి పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్యే జోగు రామన్న హామీనిచ్చారు. పట్టణంలోని టీఎన్జీవోస్ భవనంలో ఆదివారం జిల్లా ఓసీ సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్ర జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యవర్గ సభ్యు లు బాధ్యతలు స్వీకరించారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలుగా జనగం సంతోష్, క్యాతం శివప్రసాద్ రెడ్డితో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ఓసీల్లో ఉన్న పేదల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్ర భుత్వం ముందుకెళ్తున్నదని చెప్పారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లా డుతూ హక్కుల సాధనే ధ్యేయంగా సంఘం తరఫున కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రాష్ట్ర డెయిరీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మనీషా, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఆర్.రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.