శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సబ్‌జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు శనివారం ఉత్కంఠగా సాగాయి. మూడో రోజు 19 బాలుర టీంలు, 16 బాలికల టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. ఆయా జట్లు గెలుపే లక్ష్యంగా ఆడగా, ఆదివారం జరిగే నాకౌట్ క్వార్టర్ ఫైనల్స్‌లోనూ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యాయి.
శ్రీరాంపూర్, ఫిబ్రవరి 18: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో శనివారం మూ డో రోజు జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జోరుగా సాగాయి. గెలుపే లక్ష్యంగా జట్లన్నీ నువ్వా నేనా అన్నట్లు తలపడు తున్నాయి. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో క్రీడా పోటీలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 20 వరకు పోటీలు జరగనున్నాయి. ఆదివారం నాకౌట్ క్వార్టర్ ఫైనల్ పోటీలు జరగనున్నాయి. కాగా, శనివారం బాలురు 19 టీంలు, బాలికలు 16 టీంలు మ్యాచ్‌లో పోటీపడ్డాయి. కాగా, పోటీలను ఎస్సార్పీ 3 గని డీవైజీఎం సంతోష్‌కుమార్ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చే సుకొని పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో పోటీ ల్లో పాల్గొన్న. జాతీయ స్థాయి పోటీల వరకు క్రీ డాకారులు రావడం అంటే ఎంతో సంతోషదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెం ట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణరెడ్డి, కో కన్వీనర్ కే సురేందర్‌రెడ్డి, ఆర్ గోపాల్‌రెడ్డి, తదితరు లు పాల్గొన్నారు.
సబ్ జూనియర్ నేషనల్స్‌లో మొదటిసారి ఆడుతున్న. 2 సార్లు జిల్లా స్థాయిలో మొదటి బహుమతి సాధించా. కోచ్ ఆనంద్ ప్రో త్సాహంతో శిక్షణ పొందా. శ్రీరాంపూర్‌లో పోటీలకు మంచి ఏర్పాట్లు చేశారు. ఈసారి కూడా గెలుపే లక్ష్యంగా ఆడుతున్న.
-కొడిచర్ల లక్ష్మీనర్సింహ, రంగారెడ్డి
గెలుపే లక్ష్యంగా ఆడుతున్నాం. విజయంపై ధీమా ఉంది. మాది రైతు కుటుంబం. బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయస్థాయిలో రా ణిం చాలని ఉంది. శ్రీరాంపూర్‌లో క్రీడాకారులకు మంచి ఏర్పాట్లు చేశా రు. జాతీయ స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించడం బాగుంది.
-బేతింగ్చెడి మొగులాజ్, నిజామాబాద్
జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యుల కృషితోనే జా తీయ స్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహిస్తున్నాం. 20 రాష్ర్టా ల జట్లు పాల్గొంటున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి. ఒక చీఫ్ రెఫరీ, 20 మంది అఫీషియల్ రెఫరీలు పోటీలు నిర్వహిస్తున్నారు.
-జోదీష్, చీఫ్ రెఫరీ, హైదరాబాద్
జిల్లాలో మూడో సారి జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పో టీలు నిర్వహిస్తున్నాం. 2010లో గోలేటిలో, 2017లో బెల్లంపల్లిలో జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించాం. పోటీలకు సింగరేణి సహకారం బాగుంది. రాష్ట్ర జట్లు కప్ సాధిస్తాయనే ధీమా ఉంది. -రిక్కల నారాయణరెడ్డి, టోర్నమెంటు ఆర్గనైజింగ్ కార్యదర్శి
జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యా డ్మింటన్ పోటీల్లో రెండోసారి పాల్గొంటున్న. 2022 లో ఏపీలోని శ్రీకాకుళంలో పాల్గొన్న. మాది ఖమ్మం. ఈ సారి కప్పు మా జట్టుదే అనే నమ్మకం ఉంది. మా కోచ్ శ్యాం ఆధ్వర్యంలో జట్టంతా సమష్టిగా ఆడు తున్నం. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి న. అమ్మానాన్నల ప్రోత్సాహం వల్లే జాతీయ స్థా యి పోటీల్లో ఆడగలుగుతున్న.
-బోల్ల సహస్ర, ఖమ్మం
లీగ్ మ్యాచ్‌లు ఉత్సాహంగా ఆడా. కప్పు సాధిస్తాం. సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రెండోసారి పాల్గొంటున్న. ఇది వరకు శ్రీకాకుళంలో ఆడిన. మాది నల్లగొండ. మా నాన్న రైతు. జిల్లా స్థాయిలో ఒకసారి సత్తా చాటి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా. స్టేట్ మీట్లలో నాలుగు సార్లు ఆడా. మా కోచ్ దేవేందర్ వల్లే ఆడగలుగుతున్న.
-బీ రాకేశ్, నల్గొండ
మా కుటుంబమంతా ఆటగాళ్లే. తాత నారాయణరెడ్డి సింగరేణిలో పనిచేసిండు. క్రీడాకారుడు, ఒలింపిక్ గేమ్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. నాన్న శ్రీనివాస రెడ్డి కూడా క్రీడాకారుడే. వారి స్ఫూర్తితోనే ఈ పోటీల్లో పాల్గొంటున్న. 5 సార్లు సబ్ జూనియర్, జూనియర్ పోటీల్లో పాల్గొ న్న. -రిక్కల విష్ణుప్రియ, హన్మకొండ
మూడు సార్లు సబ్ జూనియర్ పోటీల్లో ఆ డిన అనుభవం ఉంది. మా నాన్న వెంకటేశ్వర్లు కూలీగా పని చేస్తున్నారు. నన్ను ఆటల పోటీల్లో ప్రోత్సహిస్తున్నారు. రెండు సార్లు జిల్లా స్థాయిలో డబుల్స్ విభాగంలో మొదటి బహుమతి సా ధించిన. క్రీడా స్ఫూర్తితో ఆడడం నేర్చుకున్న. జాతీయ స్థాయి పోటీలు మన రాష్ట్రంలోనే నిర్వహించడం ఆనందంగా ఉంది.
-ఏరుకొండ సౌమ్య, వరంగల్