కాసిపేట : మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా స్థాయి యువజనోత్సవాల సందర్భంగా నిర్వహించిన సైన్స్ మేళా (Science Mela) విభాగంలో కాసిపేట మండలంలోని ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ ( Students excel ) చాటారు.
పదో తరగతి విద్యార్థి విశ్వ సూర్య జిల్లా మొదటి బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. ముత్యంపల్లి పాఠశాల 9వ తరగతి విద్యార్థి అర్షిత్ రెండో బహుమతి , మూడో బహుమతి 9వ తరగతి రాహుల్ గెలుపొందారు.
ఈ మేరకు గెలుపొందిన విద్యార్థులకు డీవైఎస్వో హన్మంత రెడ్డి, ఈడీ దుర్గప్రసాద్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఆఫీసర్ రాజ గోపాల్, గైడ్ టీచర్ బండ శాంకరి పాల్గొన్నారు.