మంచిర్యాల టౌన్ : ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా పనిచేసిన ఎండీ మునీర్ ( MD Muneer ) ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారని టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ( Allam Narayana ) అన్నారు. మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎండి మునీర్ సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు . ఈ సందర్భంగా అల్లం నారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ( Nadipalli Diwakar Rao ) మునీరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
చిన్నతనం నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే వారని, పీడిత అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగ జర్నలిస్టుగా పనిచేస్తూ ఎంతో పేరు సంపాదించు కున్నారని కొనియాడారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో 55 రోజులపాటు సింగరేణి కార్మికుల జరిపిన సమ్మెకు జేఏసీ చైర్మన్గా మునీర్ వ్యవహరించాలని వారన్నారు. ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143 నాయకులు మారుతి సాగర్ యోగానంద్, ఇఫ్ట్ జాతీయ నాయకులు టి శ్రీనివాస్, పీవోడబ్ల్యూ నాయకురాలు మంగా, న్యూ డెమోక్రసీ నాయకుడు లాల్ కుమార్, యూనియన్ జిల్లా కన్వీనర్ ఉమేష్ కో కన్వీనర్లు రమేష్, శ్రీనివాస్, మునీర్ సోదరుడు సందాని, కుమారుడు మయూర్ తదితరులు పాల్గొన్నారు.