ఎదులాపురం, మే 5 : మున్సిపల్ కార్మికుడు దర్శ వినోద్ అనారోగ్యంతో మరణించాడు. మాజీ మంత్రి జోగు రామన్న, మున్సిపల్ మా జీ చైర్మన్ జోగు ప్రేమేందర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల ఆయన నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడకు చెందిన సాయిరి నర్సింగ్ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి వెంట సంతోష్, కృష్ణ గండ్రత్ రమేశ్, నారాయణ, కిష్టయ్య, సుమిత్, భాసర్ ఉన్నారు.