దండేపల్లి/జైపూర్/కోటపల్లి, సెప్టెంబర్19 : రుణమాఫీకాని రైతులు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునివ్వగా, బీఆర్ఎస్ నేతలు తరలివెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. గురువారం ఉదయమే నేతలను ముం దుస్తుగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. దండేపల్లి మండలంలో బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, అక్కల రవి, నాయకులు గోళ్ల రాజమల్లు, అల్లంల సంతోష్‌లను అరెస్టు చేశారు.
అలాగే జై పూర్లో టేకుమట్ల ఎంపీటీసీ బడుగు రవి, నాయకులు జగన్‌గౌడ్, దూట శేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోటపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకులు కొట్టె నారాయణ, శేగం లస్మయ్య, రాళ్ళబండి శ్యాం, కొట్టె వెంకటేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.