బాసర, మార్చి 9 : టీఎస్ కాస్ట్‌తో బాసర ఆర్జీయూకేటీ అవగాహన ఒప్పందం కుదుర్చు కోవడం వల్ల పరిశోధనలకు మరింత ఊతం లభిస్తుందని అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అరణ్య భవన్లో గురువారం టీఎస్ కాస్ట్ (తెలం గాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) బాసర ఆర్జీయూ కేటీ మధ్య అవగాహన ఒప్పం దం జరిగింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్జీయూ కేటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటరమణ సమక్షంలో ఒప్పంద పత్రంపై టీఎస్ కాస్ట్ మెంబ ర్ సెక్రటరీ ఎం నగేశ్, ఆర్జీయూకేటీ డైరెక్టర్ పీ సతీశ్ కుమార్ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ అవగా హన ఒప్పందం వల్ల పరిశోధన, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు ఎంతో దోహ దపడుతుందని తెలిపారు. రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ప్రాజె క్టులను నిర్వహించడమే కాకుండా సెమినార్లు, సమావేశాలు, వర్క్‌షాపులు నిర్వ హించేంచేందు కు తోడ్పడుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సహకారంతో ఆర్జీయూకేటీలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయన్నారు. ప్రశాంత వాతావరణం లో విద్యార్థులు అభ్యసిస్తున్నారని తెలిపారు. అనంతరం వీసీ వెంకటరమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆవిష్కరణలు ప్రోత్సహించడం అంకుర సంస్థల ఏర్పాటుకు ఆర్జీయూ కేటీ కృషి చేస్తుందన్నారు. దీంట్లో భాగంగానే నిర్మల్ జిల్లాలో ఆర్జీయూకేటీకి అను బంధంగా నిర్మల్ ఇన్నోవేషన్ హబ్ (ఎన్ఐహెచ్) ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్ సంస్థతో ఆర్జీయూకేటీ అవగాహన ఒప్పందం
నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ సంస్థతో ఆర్జీయూకేటీ బాసర అవగాహన ఒప్పం దం చేసుకున్నది. ఈ అవగాహన ఒప్పం దం ఆర్జీయూ కేటీ వైస్ చాన్స్‌లర్ సమక్షంలో డైరెక్టర్ జనరల్ కే భిక్షపతి , డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్ కుమార్ అవగాహన ఒప్పంద పత్రాలను మార్చు కున్నారు. ఈ సందర్భంగా వీసీ వెంకటరమణ మాట్లాడుతూ ఇరు సంస్థలు ఒప్పందం వల్ల సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మేలు జరుగు తుందని తెలిపారు. అధ్యాకులు, విద్యార్థులకు పరిశోధన, ట్రైనింగ్, ఇంటెన్షిప్, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పరస్పర సహకారాలు అందిపుచ్చు కోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపారు. డైరెక్టర్ జనరల్ కే భిక్షపతి మాట్లా డుతూ ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం నిర్మాణ పరిశ్రమ నాణ్యత, ఉత్పాదకతను పెంచడానికి మానవ వనరుల సామర్థ్యాన్ని అభివృద్ది చేయడా నికి దోహదపడుతుందన్నారు.
నిరుద్యోగ యువ త, నిర్మాణ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, మేనేజర్లు, సూపర్వైజర్లు, సాంకేతిక నిపుణులకు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ నిర్వహిస్తామని చెప్పా రు. డైరెక్టర్ (పీపీఆర్ అండ్ బీడీ) శాంతి, డైరెక్టర్ (పీజీ) ఆర్ అండ్ డీ రాధా కృష్ణ, డీన్ చంద్రశేఖర్ వివిధ విభాగాల హెచ్వోడీలు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.