
ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
బజార్హత్నూర్, డిసెంబర్ 23: రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని వైస్‌ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో గురువారం జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రైతులతో కేక్ కట్ చేయించి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం రైతులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రైతులు చట్ల వినిల్, పోతన్న, మల్లేశ్, సుభాష్, రాకేశ్, ఆగ్రోస్ సిబ్బంది పాల్గొన్నారు.
భీంపూర్ మండలంలో..
భీంపూర్, డిసెంబర్ 23: భీంపూర్, కరంజి(టీ), నిపాని గ్రామాల్లోని రైతు వేదిక భవనాల్లో వ్యవసాయంలో అనుభవజ్ఞులైన రైతులను సర్పంచ్‌లు, ఏఈవోలు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జీ స్వాతిక, లింబాజీ, భూమన్న, ఏఈవోలు వికాల్, మహేశ్, శంకర్, ఉపసర్పంచులు లక్ష్మీబాయి, ప్రమీల ,రైతు బంధు సమితి గ్రామాల అధ్యక్షులు రాథోడ్ ఉత్తమ్, నరేందర్‌రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.
చాందూరిలో..
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 23: చాందూరి గ్రామంలో పంట చేన్లలోనే ఏఈవోలు వినయ్‌కుమార్, దేవేందర్ రైతులను శాలువాతో సన్మానించారు. అదేవిధంగా ఆలిగూడ గ్రామంలో చేతన ఆర్గానిక్ సంస్థ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు వస్తాయని సంస్థ ప్రాజెక్టు మేనేజర్ మహ్మద్ ముజీబ్ తెలిపారు. కార్యక్రమంలో అర్సులరావ్ సాహెబ్, వెంకటేశ్వర్లు, ఉత్తమ్, మారుతి, గణేశ్, దిలీప్, విజయ్, సూర్యకాంత్, పృథ్వీ, పాండురంగ్, మహేందర్ పాల్గొన్నారు.
రైతులకు సన్మానం
నేరడిగొండ, డిసెంబర్ 23 : జిల్లా కేంద్రంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన రైతు కుంట కిరణ్‌కుమార్ రెడ్డిని సన్మానించారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీబాయి, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న, గడ్డం భీంరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఉచితంగా భూసార పరీక్షలు
ఇచ్చోడ, డిసెంబర్ 23: మన గ్రోమోర్ కోరమండల్ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ మేనేజర్ (ఏఎంఆర్వో) రాజేందర్ పేర్కొన్నారు. మండలంలోని మల్యాల గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట దిగుబడి కోసం సేంద్రియ ఎరువులు, సూక్ష్మ పోషకాలు వాడాలని సూచించారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చామని తెలిపారు. అనంతరంరైతులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మన గ్రోమోర్ కోరమండల్ శాఖ మేనేజర్ రంజిత్ కుమార్, ఫీల్డ్ అసోసియేట్ భీంరావ్ పాటిల్, కిషన్ పాల్గొన్నారు.
మార్కెట్ యార్డులో…
తాంసి, డిసెంబర్ 23: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉన్న రైతు విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగ్, సంతోష్ఖాడే, రాహుల్, గంగన్న, ఆనంద్‌రావు, శివాజీ, ఖుర్షిద్, ఎస్కే సమీర్, సురేశ్, లక్ష్మీపతి, అశోక్ పాల్గొన్నారు. అలాగే సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, పార్టీ కార్యదర్శి లంక రాఘవులు, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, నాయకులు కిరణ్, పూసం సచిన్, మయూరిఖానం, సురేందర్, కిష్టన్న, నగేశ్, కపిల్ పాల్గొన్నారు.
నల్లచట్టాలతోనే నష్టం
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 23: కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే రైతులకు నష్టం జరుగుతున్నదని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ వద్ద కిసాన్ విగ్రహానికి పూలమాల వేశారు. నల్లచట్టాల కోసం పోరాడి అమరులైన రైతులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాఘవులు, బండి దత్తాత్రి, కిరణ్, మయూరి పాల్గొన్నారు.
బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విద్యాలయ ఆవరణలో ..
ఆదిలాబాద్‌లోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఆవరణలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, బ్రహ్మకుమారీస్ ఇన్చార్జి బీకే రేవతి, బీజేపీ నాయకుడు శంకర్ పాల్గొన్నారు.