కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ ( Abdul Khaleel ) రాష్ట్ర స్థాయి ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు ( Innovative Teacher Award ) కు ఎంపికయ్యారు. జటాధర ఎడ్యూకేషన్ టెక్నాలజీస్(జేఈటీ) ప్రతిష్టాత్మక జెట్ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డుకు ఎంపిక కాగా సోమవారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో అవార్డు స్వీకరించారు.
గత 12 ఏళ్ల నుంచి బోధనతో పాటు విద్యార్థుల అభివృద్ధికి చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఎంపికైన వారిని అవార్డుతో పాటు నగదు ప్రోత్సాహంతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ వింగ్ కమాండర్ అనీష్ ఆంటోనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అబ్దుల్ ఖలీల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తోడ్పాటు మరువలేనిదని అన్నారు. ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత, ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్‌కు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.