కుభీర్, ఆగస్టు 06 : చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గాను తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంఎల్హెచ్పీ విద్యా శ్రీ సూచించారు. బుధువారం నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సిర్పెల్లి పల్లె దవాఖానాలో తల్లి పాల వారోత్సవాలలో భాగంగా గిరిజన తండాల్లోని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, గ్రామంలోని మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతపై దవాఖానా MLHP, ANM, AWT లు అవగాహన కల్పించారు. తల్లి పాలల్లో గల పోషకాల గురించి వివరించారు. ఆకుకూరలు, పాలు, పండ్లు, గుడ్లు, తృణ ధాన్యాల విశిష్టతపై అవగాహన కల్పించారు. వివిధ రకాల తృణ ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లను ప్రదర్శించి వాటి గురించి వివరించారు. అనంతరం ఎన్డిడి ఒరియంటేషన్ లో భాగంగా నట్టల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఏఎన్ఎంకే. మంగమణి, ఏడబ్ల్యూటీ శోభ, ఆశ కార్యకర్త కాంత, పిఎస్ హెచ్ఎం నాగమణి, మహిళలు పాల్గొన్నారు.