ఆసిఫాబాద్ టౌన్/రెబ్బెన,మార్చి14 : హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్‌జాదవ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు గురువారం కలిశారు. స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ వారికి సూచించారు. ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు గంధం శ్రీనివాస్, అబ్దుల్లా, సుంకరి పెంటయ్య, రెబ్బెన ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.