దండేపల్లి : దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామంలో శ్రీరామనవమి ( Srirama Navami) సందర్భంగా ఆదివారం నూతనంగా నిర్మించిన సీతారామ సహిత ఆంజనేయ ఆలయాన్ని(New Ramalayam Temple) మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ( MLA Prem Sagar Rao ) ప్రారంభించారు. దేవాదాయ-ధర్మాదాయ శాఖ నిధులు, గ్రామస్థులు సేకరించిన చందాల ద్వారా నిర్మించిన నూతన ఆలయాన్ని ఎంతో సుందరంగా నిర్మించారని ఎమ్మెల్యే కొనియాడారు .
వెల్గనూర్ గ్రామం తో పాటు దండేపల్లి మండలం పాడి పంటలతోటి అభివృద్ధి చెందుతూ శ్రీరాముని యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండి చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మూడు రోజులపాటు నిత్యన్నదానం చేసి రూ. 50 వేల నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వెలుగనూరు గ్రామస్థులు, నాయకులు పాల్గొన్నారు.