కుంటాల : మండలంలోని కల్లూరు శ్రీ దత్త వెంకట సాయి ఆలయ పరిసరాల్లో గుప్తా మహారాజ్ (Gupta Maharaj ) ఆలయ నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ (Pawar Ramarao Patel ) భూమి పూజ చేశారు. ఇటీవల మందిర ఆవరణలో రూ. 45 లక్షల సీజీఎఫ్ (CGF) నిధులతో కళాతోరణం , ప్రహరీ గోడ పనులను ప్రారంభించామని తెలిపారు.
ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో నాయకులు జీవి రమణారావు, ప్రముఖ పూజారి బబ్రు మహారాజ్, నాయకులు జీ.వి.రమణారావ్, వెంగల్ రావ్, పసుల నవీన్, చిన్నరెడ్డి, గంగాధర్, సుధాకర్, గుద్దేటి గంగాధర్, సుదర్శన్ పటేల్, సిందే దిగంబర్ పటేల్, ఆలే కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.