వైరాటౌన్, ఆగస్టు 28: కాబోయే రథసారథి మా బావ మదన్‌లాల్ అని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. బీఆర్ఎస్ వైరా అభ్యర్ధిగా బానోత్ మదన్‌లాల్‌ను ప్రకటించిన తర్వాత సోమవారం మదన్‌లాల్ వైరాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరూ బావ.. బామ్మరిది అని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. కాబోయే వైరా నియోజకవర్గ రథసారథి మా బావ మదన్‌లాల్ అని, మన నాయకుడు సీఎం కేసీఆర్ మాటే అందరికీ శిరోధార్యమని, కేసీఆర్ చెప్పింది చేయడమే నా కర్తవ్యమని, మా బావ మదన్‌లాల్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్‌లాల్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎమ్మెల్యే రాములునాయక్ సహాయ సహకారాలు, అండదండలు ఉండాలని ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు.
వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో ముందుకెళ్తామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, మున్సిపాల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మాదినేని దుర్గాప్రసాద్, కొత్తా వెంకటేశ్వరరావు, హనుమకొండ రమేష్, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, ఏదునూరి శ్రీనివాసరావు, మోరంపూడి బాబు, వనమా చిన్ని, భూమాత కృష్ణమూర్తి, కిలారి కిరణ్‌కుమార్, ఆదూరి ప్రేమ్‌కుమార్, మేడూరు రామారావు, చక్రవర్తి, గుజ్జర్లపూడి దేవరాజు, పెరుగు ప్రసాద్, దొంతెబోయిన గోపి, సూర్యదేవర శ్రీధర్, కోటేశ్వరరావు, సింగారపు నరేష్, కారుకొండ బోస్, యండ్రాతి గోపాలరావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, తన్నీరు నాగేశ్వరరావు, సురేశ్, కర్నాటి హనుమంతరావు, నల్లబోలు వెంకటరెడ్డి, యలదండి రోశయ్య, ముదిగొండ పుల్లయ్య, రంగా సత్యనారాయణ, అనుమోలు సైదులు, వల్లెపు రాము, ఏలూరి నర్సింహారావు, అప్పారావు, శివ, బత్తుల ఫణి పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. సోమవారం స్థానిక రైతువేదిక వద్ద వైరా, కొణిజర్ల, కారేపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు 79మందికి సుమారు రూ.7.90 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని, మూడోసారి సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తహసీల్దార్లు వి.సురేష్, ఎర్రయ్య, ఎంపీపీలు పావని, శకుంతల, కోఆప్షన్ సభ్యుడు లాల్‌మహ్మద్, దిశ కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జున్‌రావు, నాయకులు పెద్దబోయిన ఉమాశంకర్, చిరంజీవి, పోట్ల శ్రీనివాసరావు, మచ్చా బుజ్జి, డేరంగుల బ్రహ్మం, కాపా మురళీకృష్ణ, కిలారు మాధవరావు, రావూరి శ్రీను, మోటపోతుల సురేష్, బోడపోతుల బాబు, మద్దెల రవి, సక్కుబాయి, సాదం రామారావు, అజ్మీరా వీరన్న, చల్లా సతీశ్, నాగరాజు పాల్గొన్నారు.