ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 15 : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన మండలం ఇంద్రానగర్లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈ నెల 23,24,25 తేదీల్లో జరిగే జాతరకు రావాలంటూ ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్ సోమవారం ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంద్రానగర్ కనకదుర్గమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. జాతర మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు తిరుపతి, సురేశ్, సంతోష్, జీవన్ ఉన్నారు.