ఇచ్చోడ, డిసెంబర్ 3 : అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్ భారీ మెజార్టీతో గెలుపొందడంపై మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ర్యాలీ తీశారు.
సిరికొండతో పాటు సోంపెల్లి, పొన్న, సుంకిడి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు పటాకలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్, డిసెంబర్ 3 : శాసనసభ ఎన్నికల్లో బోథ్ ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్ ఘన విజయం సాధించడంతో ఆదివారం కౌఠ(బీ) గ్రామంలోని బస్టాండ్ ఎదుట యువకులు పటాకలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెండి సోమేశ్వర్, యువకులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, డిసెంబర్ 3 : మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబురాలు చేసుకున్నారు. అంతకుముందు ప్రధానవీధుల గుండా బ్యాండుమేళాలతో ర్యాలీ తీశారు. అలాగే మండలంలోని దేగామ, గిర్నూర్, భూతాయి, టెంబి, పిప్పిరి గ్రామాల్లో సంబురాలు హోరెత్తించారు. కార్యక్రమంలో నాయకులు చట్ల వినిల్, ఉద్దోవ్, సూదినందు, చట్ల ఉత్తమ్, భోజన్న, జానార్దన్, పాటిల్, శ్రీనివాస్, రాములు, సల్మన్ తదితరులు పాల్గొన్నారు.
సొనాల, డిసెంబర్ 3 : సొనాలలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు డప్పుచప్పుళ్లతో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, ఎంపీటీసీలు జమున-రాజేశ్వర్, సునీత-రోహిదాస్, మహేందర్, సర్పంచ్‌లు సదానందం, సకారాం, రాందాస్, పూజ-సంగ్రామ్, నాయకులు నరేందర్, సోమన్న, అమృత్‌రావ్, అభిలాష్, సుధీర్ రెడ్డి, హరీశ్, సుగుణాకర్, ఈశ్వర్, సంతోష్, జాదవ్ కృష్ణ, సచిన్, శ్రీకాంత్, రాజన్న, శంకర్ పాల్గొన్నారు.
తాంసి, డిసెంబర్ 3 : శాసనసభ ఎన్నికల్లో బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్ గెలుపొందడంతో మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జాదవ్అనిల్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాటిపల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి, సర్పంచ్‌లు స్వప్న రత్న ప్రకాశ్, కేమ సదానందం, గంగుల వెంకన్న, తూర్పుబాయి యశ్వంత్, అండె అశోక్, అలాలి జ్యోతి నర్సింగ్, కుంట సరిత కేశవ్ రెడ్డి, మునేశ్వర్ భరత్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, లక్ష్మీపతి, సిరిగిరి దేవేందర్, చంద్రయ్య, ముచ్చ రఘు, మల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు దయానంద్, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాంసి(తలమడుగు), డిసెంబర్ 3 : తలమడుగు మండలంలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంజీవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తోట వెంకటేశ్, చింతలపెల్లి దేవారెడ్డి, రవికాంత్ యాదవ్, బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్, ఉపసర్పంచ్ కరుణాకర్ రెడ్డి, కాకర్ల ప్రశాంత్, జై భారత్ రెడ్డి, చిన్నాన్న, దేవీదాస్ తిరుపతి, మున్న, రాజు, చందు, అక్షయ్, నిమ్మల సుదర్శన్ రెడ్డి, గంగాధర్, గోక ప్రకాశ్ రెడ్డి, బాదుర్ నర్సింహులు, జువ్వాక నర్సింహులు పాల్గొన్నారు.
నేరడిగొండ, డిసెంబర్ 3 : నేరడిగొండ మండలంలో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు సంబురాలు చేసుకున్నారు. మహిళలు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్‌ఎంపీపీ మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, సర్పంచ్ పెంట వెంకటరమణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లే నానక్ సింగ్, మాజీ జడ్పీటీసీ సయ్యద్ జహీర్, సీనియర్ నాయకులు గాదె శంకర్, చంద్రశంకర్, చంద్రశేఖర్ యాదవ్, ఉప సర్పంచ్‌లు దేవేందర్ రెడ్డి, ఫయాజ్ పాల్గొన్నారు.