సారంగాపూర్, ఆగస్టు 2 : రాష్ట్రంలో సంక్షేమానికి స్వర్ణయుగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలన కొనసాగుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్ మార్కెట్లో రూ. 1.13కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న షాపింగ్‌కాంప్లెక్స్, ప్రహరీ అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. రైతువేదిక భవనంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన 36 మంది లబ్ధిదారులకు రూ.36.4 లక్షల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం బోరిగాం గ్రామానికి చెందిన 9 మందికి ముద్రలోన్ కింద మంజూరైన ఆవులు, ధని, ప్యారమూర్ గ్రామాలకు చెందిన 34 మంది మహిళలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఇంకుడుగుంత పనులు ప్రారంభించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి రూ.3 లక్షలు ఇస్తున్నదన్నారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి మహిళలకు సబ్సిడీపై ఆవులు, బర్రెలను అందిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం మంత్రి తనయుడు అల్లోల గౌతమ్‌రెడ్డి రూ.1.67లక్షల సొంత నిధులతో నిర్మల్ నియోజకవర్గంలోని 3,340 మంది వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులకు మంత్రి బస్‌పాస్‌లను పంపిణీ చేశారు. రాష్ట్రంలోని మార్కెట్‌యార్డులో పనిచేస్తున్న దడువాయిలను నాల్గోతరగతి ఉద్యోగులుగా గుర్తించాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఆర్డీవో రత్నమాల, జిల్లా పశువైద్యాధికారి శంకర్, బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, నిర్మల్ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, ఆలూర్ సొసెటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ దత్తురాం, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, సర్పంచ్ సుజాత, ఎంపీటీసీ పద్మ, నాయకులు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, కండెల భోజన్న, భూమేశ్, సాగర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, లింగారెడ్డి, దేవిశంకర్, రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో సరోజ, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఏవో రాజశేఖర్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి షేక్ ముక్త్యార్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం
నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు,2: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లాకు కొత్తగా 102, 108 వాహనాలు రాగా.. మంత్రి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లోని ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 102, 108 వాహనాలు ఏర్పాటు చేశారన్నారు. ఇందులో జిల్లాకు 102 అమ్మ ఒడి వాహనాలు-3, 108 ఎమర్జెన్సీ వాహనం-1 మంజూరయ్యాయన్నారు. ప్రజలు అత్యవసర వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, నాయకులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
నిర్మల్ అర్బన్, ఆగస్టు 2 : బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మన్పూరి జ్ఞానేశ్వర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని రవినగర్‌లో వెంకటేశ్వర్రావు కుటుంబ సభ్యులను, భాగ్యనగర్‌లో విద్యాసాగర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నాయకులు రాంకిషన్ రెడ్డి, బిట్లింగ్ నవీన్, నర్సాగౌడ్, జొన్నల మహేశ్, దత్తాద్రి, చింతమోహన్ తదితరులున్నారు.