నిర్మల్ అర్బన్, డిసెంబర్ 25 : నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయమని అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్మల్‌లోని నిస్సి, గాజుల్పేట్, గొల్లపేట్, చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. మత పెద్దలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని పండుగలకు సర్కా రు సమాన ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం, సాటి మను షుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైనదని పేర్కొన్నారు. ఏసు క్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలన్నారు.
రూ.50 లక్షలతో దేవాలయ అభివృద్ధి
దేవర కోట ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌లోని అతి ప్రాచీన పుణ్య క్షేత్రమైన లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయంలో రూ. 50 లక్షలతో నిర్మించిన కల్యాణ మండపం, ఆలయ వెనుక భాగంలో నిర్మించిన 19 వాణిజ్య సము దాయాల ను మంత్రి ప్రారంభించారు. ఆయా చోట్ల మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మా జీ రాజేందర్, ఆలయ చైర్మన్ లక్ష్మీనర్సయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ రంగు రవి కిషన్, కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్, బిట్లింగ్ నవీన్, శ్రీకాంత్, ఎస్పీ రాజు, పూదరి రాజేశ్వర్, పోశెట్టి, కత్తి సుధాకర్, అనిల్, ఆయా చర్చిల పాస్టర్లు, నిర్వాహకులు తదితరులున్నారు.
కాగా జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినగర్ ఎన్టీఆర్ మార్గ్ కాలనీలోని ఉదాసీ మఠం స్థలంలో శివాలయం నిర్మించాలని కోరు తూ ఆదివారం కాలనీ వాసులు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కాలనీ అధ్యక్షుడు గంగాధర్, వెంకటేశ్, సదయ్య, లింగంపల్లి లక్ష్మీనారాయణ, భూషణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. సంఘ సభ్యు లు పొలిశెట్టి విలాస్, మంత్రి శ్రీనివాస్ గుప్త, ముక్క సురేష్, దయానంద్, జొన్న వినోద్, ఆమెడ మినోద్, పత్తి శివప్రసాద్ పాల్గొన్నారు.
శాంతికి ప్రతిరూపం క్రిస్మస్
ఏసుక్రీస్తు బోధనలు శాంతికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సోన్ మండలం మాదాపూర్ గ్రామ శివారులోని బేతాళా చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, సోన్ సర్పంచ్ టీ వినోద్, కూచన్ పెల్లి మాజీ సర్పంచ్ బండి లింగన్న, సోన్ ఎంపీటీసీ నాయకులు దాసరి శ్రీనివాస్, రాము, తదితరులు పాల్గొన్నారు.