బెల్లంపల్లి, ఫిబ్రవరి 19 : బెల్లంపల్లి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సోమవారం ప్రత్యేక ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. స్థానిక కొత్తబస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్ సౌకర్యం ఉంటుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ము న్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ రడగంబాల బస్తీలోని ఆయన నివాసంలో గాంధారీ మైసమ్మ జాతర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జరిగే జాతరను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం ఏఎంసీ ఏరియాలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. క్యాంపు కార్యాలయంలో వసతులు, గదుల సౌకర్యాలను పరిశీలించారు.
మందమర్రి, ఫిబ్రవరి 19 : మందమర్రి మార్కెట్లోని బస్‌స్టేషన్ నుంచి మేడారం జాతరకు వెళ్లే బస్సులను సోమవారం చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది నిర్మల్ డిపోనకు చెందిన 65 బస్సులను మందమర్రికి కేటాయించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎం సోలెమాన్, మంచిర్యాల డిపోమేనేజర్ రవీందర్, ఆసిఫాబాద్ డిపో మేనేజర్ శ్రీధర్, నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుడ్ల రమేశ్, సొతుకు సుదర్శన్, దుర్గం నరేశ్, కాడారి జీవన్, నోముల ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు.