చెన్నూర్ టౌన్, ఆగస్టు 21 : చెన్నూర్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఆర్థిక అవకతవకలు వె లుగులోకి వచ్చాయి. స్థానిక పాత బస్టాండు సమీపంలోని ఎస్బీఐ 2లో గురువారం తనిఖీ(ఆడిట్) నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో తేడాలున్నట్లు సిబ్బంది గమనించారు. బ్యాంక్ మే నేజర్ సదరు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు జైపూర్ ఏసీఈ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ దేవేందర్ రావుతో పాటు తమ సిబ్బందితో కలిసి రామగుండం కమిషనర్ సీపీ అంబర్ కిశోర్ ఝా బ్యాంకులో విచారణ చేపట్టారు.
మేనేజర్‌తో పాటు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విలేకరులతో సీసీ మాట్లాడుతూ బ్యాంకులోని ఒక ఉద్యోగి కనబడడం లేదని, ఆడిట్లో బంగారం, నగదులో తేడాలున్నట్లు గమనించామని మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచారణ చేపడుతున్నామని, సీసీ కెమెరాలను పరిశీలించి, కేసు ఛేదిస్తామని పేర్కొన్నారు. బ్యాంకులో క్యాషియర్ అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.
గోల్డ్ లోన్లు, నగదు నిల్వలో పెద్ద మొత్తంలో తేడాలున్నట్లు ఆడిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నగ దు, బంగారం మిస్సయ్యిందో మేనేజర్, సిబ్బంది లెక్కిస్తున్నా రు. విషయం తెలుసుకొని ఖాతాదారులు బ్యాంకు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నగదు డిపాజిట్లు, బంగారం లోన్లు, లాకర్లలో ఉంచిన నగలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆడిట్ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడించనున్నట్లు బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు తెలిపారు.