కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipet ) మండలంలోని తిరుమలాపూర్ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బడి బాట నిర్వహించారు. ఇందులో భాగంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధిక( Suprvisor Radhika ) పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో అవసరమన్నారు. 3 సంవత్సరాల నుంచి ఐదేండ్ల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలన్నారు. అనంతరం పిల్లలతో హ్యాండ్ వాష్ కార్యక్రమాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ అంబారావు, అంగన్వాడీ టీచర్ లలిత, హెల్పర్ లక్ష్మీ, పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.