ఆదిలాబాద్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై ఈనెల 10న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీజీ ఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు. ఆదిలాబాద్లో జరిగిన ఉద్యోగుల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.
ఉద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చర్చల పేరుతో కాలయా పన చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వక, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయంటూ సాకులు చెబుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.