మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 30 : మంచిర్యాలలోని గోదావరి నది తీరంలో రూ. నాలుగు కోట్లతో వైకుంఠధామం నిర్మించాలని మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో రూ. రెండు కోట్లతో వైకుంఠధామానికి ప్రహరీ నిర్మాణం, మరో రూ. రెండు కోట్లతో వైకుంఠధామం అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానం చేసింది. సోమవారం మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పల య్య అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించగా, పలు అంశాలపై చర్చ సాగింది.
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 200 ఫీట్ల రోడ్డును మాస్టర్ ప్లాన్‌నుంచి తొలగించాలని కౌన్సిల్ తీర్మానం చేసింది. గతంలో పాతమంచిర్యాలకు చెందిన కైలస్ శ్రీనివాస్‌తో పాటు 13 మంది తమ స్థలంలో కమర్షియల్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని దరఖాస్తులు చేసుకోగా, వారి స్థలం 200 ఫీట్ల రోడ్డు పరిధిలోకి వస్తుందని తిరస్కరించారు. దీంతో వా రు హైకోర్టును ఆశ్రయించారు. సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించాలని సూచించింది.
దీంతోపాటు ఈ 200 ఫీట్ల రోడ్డు నస్పూరు, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో కూడా విస్తరించి ఉంది. ఇప్పటికే పలు కాలనీ లు, లేఅవుట్ అప్రూవ్డ్ భూములు ఈ రోడ్డు పరిధిలోనే ఉన్నాయి. నష్ట పరిహారం చెల్లించడానికి మున్సిపాలిటీలో సరిపడా నిధులు లేనందున ఈ రోడ్డును మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని నిర్ణయించిన కౌన్సిల్, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనున్నది. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే పలు అభివృధ్ది పనులకు కౌన్సిల్ ఆమోదం పలికింది.
సెప్టెంబర్‌లో అత్యవసరంగా చేపట్టిన పనులకు అయిన మొత్తం రూ. 5 లక్షలను చెల్లించడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అమృత్ 2.0 స్కీం లో భాగంగా పట్టణాలకు జీఐఎస్ బేస్డ్ మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి పరిపాలనా అనుమతులు లభించా యి. పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. 18వ వార్డు కౌన్సిలర్ హ ఫీజా మాట్లాడుతూ తమ వార్డులో తాగునీరు సమస్య ఉందని, ఖబరిస్థాన్‌లో పిచ్చి మొక్కలు పెరిగాయని, ఆఖరీసఫర్ వాహనాన్ని ్రపారంభించాలని కోరారు.
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్ మాట్లాడుతూ పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, చెత్త వాహనాలకు మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహేశ్, కమిషనర్ మారుతీప్రసాద్, ఎంఈ మసూద్ అలీ, ఏఈ రాజేందర్, ఆర్వో శ్రీనివాస్‌రెడ్డి, టీపీవో సంపత్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్‌కిరణ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.