మందమర్రి(రూరల్) / చెన్నూర్ : రాష్ట్రంలోని ఆదిలాబాద్, హాకీంపేట్, కరీంనగర్ ప్రభుత్వ స్పోర్ట్స్ ( Sainik School ) క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం మండల స్థాయి పోటీలను ఈ నెల 18న మందమర్ని పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్, చెన్నూర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారి దత్తుమూర్తి (MEO Dattumurthy) , చెన్నూర్ మండల విద్యాధికారి కొమ్మరా రాధ క్రిష్ణ మూర్తి (Radha Krishnamurthy) తెలిపారు.
సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారం పోటీలు జరిగే రోజున వెంట తీసుకొని రావాలని సూచించారు. మూడవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జనన, ఆధార్, కుల దృవీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారు 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య జన్మించిన వారై ఉండాలని అన్నారు. ఎత్తు బరువుతో పాటు ఏడు శారీరక పరీక్షల్లో 15 మార్కులు పైన వచ్చిన విద్యార్థిని విద్యార్థులు అర్హులని వివరించారు. అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.