దండేపల్లి, నవంబర్21 : బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చేశాం..అందుకే మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నాం..అని మంచిర్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలంలోని నాగసముద్రం, మాకులపేట, గుడిరేవు, వెల్గనూర్, నంబాల గ్రామంలో మంగళవారం ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదే అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు గ్రామాలను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. మరోసారి మీరు ఆశీర్వదిస్తే గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇస్తామని, గృహలక్ష్మి పథకం కింద నిరుపేదలకు నెలనెలా రూ.3వేల పింఛన్ అందిస్తామన్నారు. ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులను చూసి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఉన్న కరెంటు పోతుందన్నారు. 3గంటల కరెంటు అంటున్న కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలన్నారు. నియోజకవర్గం మరింత అభివృద్ది చెందాలంటే ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, యూత్ నాయకులు, నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి చేసిన వారిని గెలిపించండి ; ఎమ్మెల్యే సతీమణి రాజకుమారి
మంచిర్యాలటౌన్, నవంబర్ 21: తొమ్మిదేళ్లలో మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే దివాకర్రావునే మరోమారు గెలిపించాలని ఆయన సతీమణి రాజకుమారి ఓటర్లను కోరారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని పాతమంచిర్యాలలో ఆమె ఇంటింటా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియజేస్తూ ఓటు అభ్యర్థించారు. తెలంగాణ వచ్చాకే మంచిర్యాల జిల్లాగా ఏర్పడిందని, కొత్త జిల్లాగా ఏర్పడిన మంచిర్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే అహర్నిశలు కృషిచేశారని గుర్తు చేశారు. మరోమారు అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని అన్నారు. ఆమె వెంట మున్సిపల్ కౌన్సిలర్లు బొలిశెట్టి సునీత, వంగపల్లి అనిత, మాజీ కౌన్సిలర్ కమల, తదితరులున్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం..
మంచిర్యాలటౌన్, నవంబర్ 21: బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బోరిగం శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు గెలుపును కోరుతూ మంగళవారం మంచిర్యాలలోని అశోక్‌రోడ్‌లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఒకసారి పోల్చి చూసుకోవాలని సూచించారు. మీ కళ్లముందు కనపడుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు యూత్ ప్రెసిడెంట్ రగళ్ల గోపి, మహిళా అధ్యక్షురాలు సమ్మెల అర్చన, కోలేటి నగేశ్, సీతారాం, హలీం, తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాలను నిర్వహించారు. దివాకర్‌రావుకు మద్దతుగా కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు.
నస్పూర్‌లో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం
సీసీసీ నస్పూర్, నవంబర్ 21: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు గౌస్, గర్శె భీమయ్య ఆధ్వర్యంలో న్యూరెడ్డికాలనీ, వినూత్న కాలనీల్లో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. 11వ వార్డులో కౌన్సిలర్ జబీన్హైమద్ ఆధ్వర్యంలో జగదాంబ కాలనీ, హనుమాన్ నగర్, ఎస్ఎల్ఆర్ కాలనీల్లో ప్రచారంచేశారు. 22, 25 వార్డుల్లో కౌన్సిలర్లు వంగ తిరుపతి, కుర్మిళ్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే నస్పూర్ పట్టణం మరింత అభివృద్ధి జరుగుతుందని నాయకలు తెలిపారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో నాయకులు పానుగంటి సత్తయ్య, ఎంబడి సమ్మయ్య, మేడం తిరుపతి, గర్శె రామస్వామి, పెద్దపల్లి వెంకటేశ్వర్లు, నూనె సుధాకర్, మాడుగుల స్వామిదాస్, చెరుకు శంకర్, అక్కల పోషం, మాడుగుల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు ఓటేయండి.. సంక్షేమ పథకాలు అందుకోండి
-బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్‌రావు, చైర్మన్ ప్రభాకర్
బీఆర్ఎస్కు ఓటు వేయండి.. సంక్షేమ పథకాలను అందుకోండని నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ అన్నారు. మంగళవారం సాయంత్రం సీసీసీ నస్పూర్ వారసంతలో ప్రచారసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారసంత ఏర్పాటు కోసం దివాకర్‌రావు ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. వారసంత స్థలం విషయంలో నెలకొన్న వివాదంలో వ్యాపారస్తులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడినట్లు గుర్తు చేశారు. వ్యాపారుల కోసం రూ.7.20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నస్పూర్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటు అయినప్పటికీ ఇప్పటి వరకు దాదాపు రూ.135 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. వారసంత వ్యాపారులకు అండగా నిలిచిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. పొరపాటున ఇతర పార్టీలకు ఓటు వేస్తే వారసంత స్థలం కబ్జాకు గురై వ్యాపారులంతా రోడ్డునపడుతారని అన్నారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలను వ్యాపారస్తులకు వివరించారు. ఈ ప్రచార సభలో వారసంత వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బండి పద్మ, కుర్మిళ్ల అన్నపూర్ణ, టీబీజీకేఎస్ నాయకులు ఢీకొండ అన్నయ్య, కాశీరావు, తదితరులు పాల్గొన్నారు.