ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హెలిప్యాడ్ సిద్ధం చేయగా, సభా వేదికను శరవేగంగా నిర్మిస్తు న్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి చేరుకోనుండగా, భారీగా జనాన్ని సమీకరించి సభను విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, సీనియర్ నాయకుడు రవీందర్రావు ఏర్పాట్లను పరిశీలించారు.
– నిర్మల్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ)
నిర్మల్, నవంబర్ 25(నమస్తే తెలంగా ణ) : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖానా పూర్‌కు ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ రానున్నారు. పట్టణంలోని అయ్యప్ప ఆలయం సమీపంలో గల సువి శాలమైన స్థలంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. అధినేత సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు భారీ జన సమీకరణ కు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. దాదాపు 60 వేల మందికి పైగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలిరానున్న నేపథ్యం లో వారికి ఎలాంటి ఇబ్బందులు కలు గకుండా నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కేసీఆర్‌ను కళ్లారా చూసి, ఆయన ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రానున్నారు. కాగా సభా ప్రాంగణంలో వేదిక నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సీఎం రాక కోసం సభాస్థలి పక్కనే హెలీ ప్యాడ్‌ను సిద్ధం చేశారు. శనివారం బీఆర్ ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, సీనియర్ నాయ కులు పైడి పెల్లి రవీందర్రావు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సీఎం సభకోసం ట్రాఫిక్‌ను మళ్లించ నున్నారు.
వాహనాల పార్కింగ్‌కోసం హైటె క్ సిటీ స్థలాన్ని ఎంపిక చేశారు. నిర్మల్ వైపు నుంచి ఖానాపూర్ పట్టణంలోకి వచ్చే రోడ్డును సభ ముగిసే వరకు మూసివే యనున్నారు. రాజురా, అంకెన, పోచంపె ల్లి, రాయదారి, ఉట్నూర్, కడెం తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారు తర్లపాడ్ రోడ్డు, దిలావర్పూర్, లింగాపూర్ గ్రామాల మీదుగా సభా స్థలికి చేరుకో వాల్సి ఉంటుం ది. మస్కాపూర్, సుర్జాపూర్, బాదన్‌కుర్తి వైపు నుంచి వచ్చే వాహనాలను జగన్నాథ్ చౌక్ గుండా అనుమతిస్తారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు.