Tiger Foot Prints : మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ పరిధిలోని తాళ్లాపేట్ రేంజ్లో పెద్ద పులి(Tiger Foot Prints) పాదముద్రలను గుర్తించారు. మాంసాహార జంతువుల గణనలో భాగంగా శనివారం అటవీశాఖ, జంతుప్రేమికులైన వాలంటీర్లు సర్వే చేపట్టారు. 5వ రోజు సర్వేలో చింతపెల్లి, పాత మామిడిపెల్లి బీట్ అడవుల్లో పెద్దపులి పాదముద్రలు గుర్తించామని ఎఫ్డీవో రాంమ్మోహన్ తెలిపారు.
అభిల భారత జంతుగణనలో భాగంగా ఈ సర్వే నిర్వహించారు. జంతు ప్రేమికులు, వాలంటీర్లు, అటవీశాఖ సిబ్బంది చేపట్టిన ఈ సర్వేలో కవ్వాల్ టైగర్ రిజర్వుడ్ అడవుల్లో పెద్ద పులి పాదముద్రలను కనుగొన్నారు. పెద్ద పులి పాదముద్రలు లభించడం ఈప్రాంతానికి ఎంతో శుభసూచికమని ఎఫ్డీవో రాంమ్మోహన్ అన్నారు.