మూడేండ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్నా. మంచిర్యాలలో డాక్టర్‌కు చూపించుకున్నా. మందులిచ్చారు. కండ్లద్దాలు కూడా తీసుకోవాలని సూచించారు. బాగా డబ్బులు అవుతున్నా యని మందులు తీసుకొని వచ్చా. కండ్లద్దాలు తీసుకోలేదు. మళ్లీ రావాలని డాక్టర్లు సూచించారు. నేను ఉండేది ఆసిఫాబాద్‌లోని రెబ్బెన. మంచిర్యాల పోవాలంటే చాలా దూరం. డబ్బులు కూడా బాగా అవుతున్నాయి. ఇంతలనే మా ఊరిలో సర్కారోళ్లు కంటి పరీక్షలు చేశారు. నేను కూడా చూపించుకున్నా. ఉచితంగా మందులు, కండ్లద్దాలు ఇచ్చారు. కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా పని అయిపోయింది.
– దుర్గం వాణిబాయి, రెబ్బెన.