చెన్నూరు, జూన్ 16: ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల (Sports School) మండలస్థాయి ప్రవేశ పరీక్షను ఈ నెల 18న చెన్నూరులో నిర్వహించనున్నారు. దీనిద్వారా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు పోటీలను చెన్నూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఈమేరకు ఎంఈవో రాధా కృష్ణమూర్తి, మండల ఇన్చార్జి వ్యాయామ ఉపాధ్యాయుడు ఫణి రాజా వెల్లడించారు. ఈ ప్రవేశపరీక్షలో పాల్గొనే విద్యార్థులు 2016 సెప్టెంబర్ 1 నుంచి 2017, సెప్టెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. అదేవిధంగా tgss.telangana.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకొని ప్రింట్ కాపీని తీసుకొని రావాలని కోరారు.