get together | తాండూర్, జూన్ 1: మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని సురభి మినీ ఫంక్షన్ హాలులో ఆదివారం తాండూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల 1999-2000 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా చిన్ననాటి స్నేహితులు ఒకే వేదికపై చేరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ.. ఆనాటి జ్ఞాపకాలను, తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు.
ఈ స్నేహితులు గతంలో తమ తోటి స్నేహితుల కష్టసుఖాలను పంచుకొని అనారోగ్యానికి గురైనా, మృతి చెందిన స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి తోడుగా నిలిచారు. అలాగే పలు సేవా కార్యాక్రమాలు కూడా నిర్వహించారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని ముక్తకంఠంగా అందరూ తీర్మానించారు. ఈ సందర్భంగా మిత్రులు అలనాడు చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయి. అటాపాటలతో సందడి చేశారు. అనంతరం అప్పటి గురువులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన పూర్వ గురువులు మాట్లాడుతూ.. పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరం ఒకే చోట కలుసుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. అనంతరం విద్యార్థులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.