రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు చౌల్ల హర్షిత ఎంపిక
పదోతరగతి విద్యార్థిని చౌల్ల హర్షిత రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పీడీ సాంబమూర్తి తెలిపారు.
తాండూర్, అక్టోబర్ 26 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ జెడ్సిహెచ్ఎస్ కు చెందిన పదోతరగతి విద్యార్థిని చౌల్ల హర్షిత రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పీడీ సాంబమూర్తి తెలిపారు. ఈ నెల 25వ తేదీన పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మంచిర్యాలలో ట్రీనిటీ హైస్కూల్లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి పోటీల్లో జిల్లా జట్టు బంగారు పథకం సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
మంచిర్యాల జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చౌల్ల హర్షిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వచ్చే నెల మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. పోటీలకు ఎంపికైన విద్యార్థినిని పాఠశాల హెచ్ఎం పీ ఉమాదేవి, సర్పంచ్ మారిశెట్టి స్రవంతి, ఉప సర్పంచ్ గట్టు సంతోష్ కుమార్, ఏఏపీసీ చైర్మన్ చిలుకమ్మ, నాయకులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

