కోటపల్లి, సెప్టెంబర్ 16 : మంచిర్యాల జిల్లా చెన్నూరులో రాష్ట్ర కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన నేపథ్యంలో కోటపల్లి మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కాగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తు తున్నాయి.
చెన్నూరులో మంత్రి వివేక్ కు కూడా నిరసన సెగ తగిలే అవకాశం ఉందని ముందస్తుగా కోటపల్లి మండల బీర్ఎస్ నాయకుల ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయమే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు పోలీస్ లు వారివద్ద నుండి సెల్ ఫోన్లు సైతం లాక్కున్నారు. మీడియా కు సైతం ఫొటోస్ తీసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.