కాసిపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి
కాసిపేట, ఆగస్టు 16 : మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను కాసిపేట ఎంపీపీ రొడ్డ లక్ష్మి ఆదేశించారు. కాసిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ప్రగతి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ఎంఏ అలీం, డీటీ లక్ష్మీరాజయ్య, ఎంపీటీసీలు చంద్రమౌళి, పద్మ, కోఆప్షన్ సిరాజ్ఖాన్, సర్పంచ్లు అజ్మీరా తిరుపతి, సంపత్ నాయక్, అప్పని స్వరూప, స్వప్న, లక్ష్మి, ఎంపీవో సఫ్దర్ అలీ, విద్యాధికారి దామోదర్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.