నస్పూర్, జూలై 7 : జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ఆశీష్సింగ్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ అటవీ శాఖ అధికారులతో జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేశామని, అటవీ చట్టాలను ఉల్లంఘించి అటవీ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
ఆక్రమణకు పాల్పడిన వారు ఎవరైనా సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో ఏసీపీలు ప్రకాశ్, రవికుమార్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, అటవీ అధికారులు పాల్గొన్నారు.
నస్పూర్‌లోని కలెక్టర్‌లో సోమవారం గౌడ కులస్తులకు కలెక్టర్ కుమార్ దీపక్ కాటమయ్య రక్షా కిట్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమం కోసం ఈ కిట్లను అందిస్తున్నారని, వీటి వల్ల 80 శాతం ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివ్ఆశీష్సింగ్, ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ, అధికారులు పురుషోత్తం, సమ్మయ్య, సురేశ్, నరేష్, శ్రీధర్ పాల్గొన్నారు.