సీసీసీ నస్పూర్, నవంబర్ 26 : నూతన ఆవిష్కరణలకు వైజ్ఞానిక ప్రదర్శనలు చక్కటి వేదికని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పే ర్కొన్నారు. నస్పూర్ పట్టణంలోని సీసీసీ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మంచిర్యాల జిల్లా స్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞానిక ప్రదర్శన బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశా రు. అనంతరం డీఈవో యాదయ్యతో కలిసి బా ల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లలు కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ వైజ్ఞాని క ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూ డాలని అధికారులకు సూచించారు. అనంతరం డీఈవో యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ మాట్లాడుతూ సైన్స్‌పై పాఠశాలల్లో వి ద్యార్థులకు నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. మంచిర్యాల జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొని ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలను పరిశీలించారు. సాంస్కృతిక ప్రదర్శన లు ఆకట్టుకున్నాయి. నస్పూర్ మండల విద్యాధికారి పద్మజ, ట్రస్మా ప్రతినిధులు మైదం రామకృష్ణ, రేగళ్ల ఉపేందర్, పద్మచరణ్, మహేశ్వర్‌రెడ్డి, ఆక్స్ఫర్డ్ పాఠశాల ప్రిన్సిపాల్ జూబిన్జాయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.