లక్షెట్టిపేట,సెప్టెంబర్ 13 : ప్రతి చెరువుకూ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ హద్దులను గుర్తించి మార్కింగ్ చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవా రం మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల, లక్షెట్టిపేట, బొట్లకుంట చెరువులను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వరకు ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేశారు.
చెరువు ప్రాంతంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగించాలన్నారు. చెరువు విస్తీర్ణం గుర్తించి పూర్తి వివరాలు తెలియజేయాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను కోరారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దిలీప్‌కుమార్, ఇరిగేషన్ డీఈ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.