సీసీసీ నస్పూర్, మార్చి 20: లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల కలెక్టర్ సంతోష్ కోరారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి బుధవారం నస్పూర్‌లో ర్యాలీ నిర్వహించారు. సీసీసీ కార్నర్ వద్ద ప్రతిజ్ఞ చేసిన అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చే సుకోవాలని కోరారు. స్వీప్‌లో భాగంగా వాక్ టూ పోలింగ్ బూత్, ఓటు వినియోగం, ప్రా ముఖ్యతను తెలియజేసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఓటర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి కళాకారుల ఆటాపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్డీవో వడాల రాములు, స్వీప్ సమన్వయకర్త రాంచందర్, నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీశ్, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సమత, సీఐ ఆకుల అశోక్, ఎస్ఐ రవికుమార్, మున్సిపల్ రెవెన్యూ అధికారి కే సతీశ్, మెప్మా ఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.