బజార్ హత్నూర్: ఎడ్ల బండి ( Bullock cart ) ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కోలారి గ్రామానికి చెందిన కాలే కాశీనాథ్ (55) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై బజార్హత్నూర్ (Bazar Hatnur) నుంచి కోలారి వస్తూ ఎడ్ల బండిని ఢీ కొనగా తీవ్రంగా గాయపడ్డాడు.
అటు వైపుగా వెళ్లే ప్రయాణికులు గమనించి కాశీనాథ్‌ను బజార్ హత్నూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బోథ్‌కు తరలించే క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు మృతుని కుమారుడు రాందాస్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.