తాండూర్ : ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ( Free Medical Camps) వినియోగించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్ నాయక్ ( Sudhakar Naik ) కోరారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం నర్సాపూర్ కమ్యూనిటీ హాల్లో గురువారం ప్రధాన్ మంత్రి జన్జటీ ఆదివాసి న్యాయ మహా అభియాన్ మెడికల్ క్యాంపును నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య పరీక్షల వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఏనుగు ఝాన్సీరాణి, డాక్టర్ ఆదిత్య సర్పంచ్ ప్రభాతావు , ఉప సర్పంచ్ పర్బత్ రావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పుట్ట సత్తయ్య, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ పంచాయతీ సెక్రటరి జగదీశ్, అంగన్వాడీ టీచర్ జమున, సీతభాయి పాల్గొన్నారు.