ఇంద్రవెల్లి, నవంబర్ 13 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గల కొనుగోలు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనతో మొక్కజొన్న రైతులు అవస్థలు పడుతున్నారు. పంట అమ్మిన తర్వాత కూడా లోడింగ్ చేసే వరకు ఉండాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు. చలిలో వణుకుతూ ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అమ్మే వరకే మా బాధ్యత ఉండాలని, అమ్మిన తర్వాత అధికారులే చూసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా.. కొనుగోలు కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌లో వేలిముద్రలు రావడం లేదని ఆరోపించారు. తమ బంధువుల పట్టాల ద్వారా పంట ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టి సారించి.. కాంట వేసిని పంటను లోడింగ్ చేసే వరకు రైతులను ఉంచకూడదని.. బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.