వేమనపల్లి, నవంబర్ 20 : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బుధవారం వేమనపల్లి మండలంలోని ప్రాణహిత నది వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద రాచర్ల పుష్కరఘాట్ వద్ద నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. నది అవతలి వైపున మహారాష్ట్ర ఉండడం, బుధవారం అక్కడ ఎన్నికలు జరుగుతుండడంతో పడవల ద్వారా మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగించే వారిని వేమనపల్లి పుష్కర ఘాట్ వద్ద తనిఖీ చేశారు.
ఆధార్‌కార్డులు, బ్యాగులను తనిఖీలు చేశారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అం దించాలని పడవలు నడిపేవారికి సూచనలు చేశారు. అసాంఘిక శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.