LPG Gas | పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్, చమురు నిల్వలు తగ్గిపోతాయని, ధరలు పెరుగుతాయంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో అప్రమత్తమైన జనాలు కొన్ని రోజుల నుంచి వేకువ జామునే ఏజెన్సీల వద్దకు వెళ్లి లైన్లో నిలబడుతున్నారు. తాము గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ ఇంకా రావడం లేదని డీలర్లను వినియోగదారులు నిలదీస్తున్నారు.
ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీ ముందు వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో భారీగా క్యూ కట్టారు. ఏజెన్సీ నిర్వాహకులు ఈ నెల 20వ తేదీన బుక్ చేసుకున్న వారికి మాత్రమే సిలిండర్లు పంపిణీ చేస్తామని బోర్డు తగిలించారు. ఆరు రోజుల కిందట బుక్ చేసుకున్న వారికి సిలిండర్లు పంపిణీ చేస్తుండడంతో మిగతావారు సిలిండర్ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఓ వైపు ఆదిలాబాద్ జిల్లాలో సిలిండర్ల కొరత లేదని అధికారులు ప్రకటనలు ఇస్తున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. రోజుల తరబడి తిరుగుతున్నా తమకు సిలిండర్లు దొరకడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి : నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ