నార్నూర్ : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains ) ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ (Narnoor and Gadiguda ) మండలాల్లోని వాగులు వంకలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బారిక్ రావు గూడ,దన్నుగూడ, మారుగూడ, కునికసా గ్రామ సమీపంలోని వాగులల్లో వరద ప్రవాహం ఉదృతంగా ఉప్పొంగింది. దీంతో ఆ గ్రామ ప్రజలు రెండు రోజులుగా బాహ్య ప్రపంచాన్ని దూరంగా ఉన్నారు.
అత్యవసర సమయంలో కూడా బయటికి రాని పరిస్థితి నెలకొంది. వరద నీరు తగ్గేవరకు గ్రామ ప్రజలు బయటికి రాలేని దుస్థితి. కఖడ్కి, లోకారికే, అర్జుని, గుండాయి కల్వర్టులపై వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద తగ్గేవరకు వాహనాలు, ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. భారీ వర్షాలు కురుస్తుం డడంతో ఉమ్మడి మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖల అధికారులు కోరారు. . వర్షాలతో సమస్యలు తలెత్తితే తక్షణమే అధికారుల దృష్టికి తేవాలని కోరారు. గురువారం వేకువ జామున నుంచి భారీ వర్షం కురిసింది.