సిర్పూర్(టీ), మే 26 : వెంకట్రావ్పేట్ గ్రామంలోని ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఓ భారీ లారీ బురదలో దిగబడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలో మీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆపై లారీని బయటకు తీయడంతో రాకపోకలు సాగాయి.
కాగా, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ఈ మార్గం గుండా నిత్యం వందలాది వాహనాలు నడస్తున్నాయని, భారీ లారీలు వెళ్లడం వల్ల రోడ్డు గుంతలమయమైందని, వర్షాలు పడితే వాహనాలు దిగబడిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ రూట్లో భారీ వాహనాలను అనుమతించవద్దని వారు కోరుతున్నారు.