బేల, నవంబర్ 13 : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లక్ష్మీనారాయణస్వామి ఆలయం జై శ్రీమన్నారాయణ నామస్మరణతో మారుమోగింది. స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగగా.. భక్తులు ప్రత్యేక వేషధారణతో ఆకట్టుకున్నారు. మహిళలు కోలాటాలు, భజనలు చేస్తూ ముందుకు సాగగా.. మంగళహారతులతో స్వాగతం పలికారు.
అశేష జనవాహిని మధ్య శోభాయాత్ర కనులపండువగా సాగింది. పురవీధులు స్వామి వారి నామ స్మరణతో మారుమోగగా.. ఉమ్మడి జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. కాగా.. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయాన్నే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న దంపతులు సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహించారు.