చట్టాలపై అవగాహన ఉండాలి
భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని ఉట్నూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి అన్నారు
- ఉట్నూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి
- గలియబాయి తండాలో న్యాయ విజ్ఞాన సదస్సు]
ఇంద్రవెల్లి, జనవరి 10 : భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని ఉట్నూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి అన్నారు. మండలంలోని ఏమాయికుంట గ్రామపంచాయతీ పరిధిలోని గలియబాయి తండా గ్రామంలో మంగళవారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. చట్టాలపై ప్రజలకు అవగాహన ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
చట్టపరంగానే అందరికీ న్యాయం చేకూరుతుందని చెప్పారు. చట్టాలు ఎప్పడు ఎవరికీ చుట్టాలు కావని, చట్టాల ముందర అందరూ సమానమేన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే చట్టపరంగానే శిక్షిస్తామని చెప్పారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

