నార్నూర్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ( BR Ambedkar ) పై అనుచిత వాక్యాలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన ( Legal action ) చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు మానే సంతోష్ డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్న ఓం ప్రకాష్ అనే వ్యక్తి బాబాసాహెబ్ ను అవమానపరిచేలా మాట్లాడారని అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల జేఏసీ కో కన్వీనర్ రాందాస్ జాదవ్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అరిక్లె దశరథ్, దళిత హక్కుల మండల కో కన్వీనర్ గాయక్వాడ్ విలాస్ పాల్గొన్నారు.