కడెం, నవంబర్ 4 : మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం జోరం దుకున్నది. ప్రజాప్రతినిధులతో పాటు, కార్య కర్తలు, మహిళలు ఇంటింటా ప్రచారం నిర్వహి స్తున్నారు. లక్ష్మీసాగర్ గ్రామంలో ఉపసర్పంచ్ ముడికె మల్లేశ్‌యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్ధి జాన్సన్‌నాయక్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ జిల్లా నాయ కుడు భూక్యా బాపురావు, నాయకులు కంతి గంగసాగర్, భూక్యా రాజేశ్ నాయక్, మహిళ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, నవంబర్ 4 : అభివృధ్ధి, సంక్షే మం కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేయా లని ఓటర్లను ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కోరారు. శనివారం మండల బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవోజిపేట, కొత్త పెద్దూర్, గొడిసెర్యాల, తదితర గ్రామాల్లో ప్రజాప్రతిని ధు లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేవోజిపేటలో పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలింపించాలని కోరా రు.
ఖానాపూర్ రూరల్, నవంబర్ 4 : ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా భూక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించా లని జడ్పీటీసీ భూక్యా జానుబాయి పేర్కోన్నారు. ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలో శని వారం ఆమె పర్యటించారు. బీఆర్ఎస్ నాయకు లతో కలిసి గడపగడప తిరిగి ప్రచారం నిర్వ హించారు. అనంతరం గ్రామంలో ఇటీవల ఎన గందుల స్వామి, కోలా నర్సిగంరావుల కుటుం బాలను పరామర్శించారు. చిన్నం రవి, పులివేని సత్యనారాయణ, చిలివేరి మల్లేశ్, పెద్దిరాజు, గుమ్ముల లింగన్న, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉట్నూర్, నవంబర్ 4 : జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందుకూరి రమేశ్, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభా కర్‌రెడ్డి మండల కేంద్రంలో ముమ్మరంగా ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయ వా డ, శాంతినగర్, ఇతర కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పథకాలపై అవగాహన కల్పించారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు సలీం, వాసు, కార్యకర్తలు ఉన్నారు. ఉట్నూర్‌లోని అంగడి బజార్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపు ఉన్న నేత అని పేర్కొన్నారు. పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్, నాయకులు ముజీబ్, ఆశన్న, వాసు, చౌకత్ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, నవంబర్ 4 : ఎన్నికల తర్వాత రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మార్కేట్ కమిటీ చైర్మన్ శ్రీరాం జదవ్, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ దావులే బాలా జీ, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని పెర్క గూడ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. లక్కారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్సుకోల తిరుపతి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. పులిమడుగు, ఉమ్రి గ్రామంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, మాజీ మండలాధ్యక్షుడు సింగారే భారత్ నాయకు లతో కలిసి ప్రచారం చేశారు. అదే విధంగా హస్నా పూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ముమ్మ రంగా ప్రచారం చేశారు. దంతన్‌పెల్లి గ్రామంలో సీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ నాయ కుడు దాసండ్ల ప్రభాకర్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. మండల పరిషత్ కోఆ ప్షన్ సభ్యుడు రషీద్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సెడ్మకి సీతారం, సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ కోల సత్తన్న, భూమన్న, సీడాం సోనేరావు, బలవంత్, ముంజం అనుదీప్, గంగేశ్వర్, పోసక్క, బబిత, దూట మహేందర్, సాజిత్ సిద్దికి, గంగరాజు, సల్గర్ రవీందర్, కాటం రమేశ్, కేంద్రే రమేశ్, బలిరాం, జాదవ్ వసంత్, న్యాను, అజయ్, నాయకులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్ 3 : బీఆర్ఎస్ నాయకు లు శనివారం మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భగా మాజీ ఎంపీపీ కనక తుకారం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కర పత్రాలను పంచారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు సూచించా రు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, నాయకులు కనక హన్మంత్‌రావు, వైస్ ఎంపీపీ గోపాల్‌సింగ్, ఎంపీటీసీ రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫీయాన్, నాయకులు శివాజీ, నవాబ్ ఉన్నారు.