మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 17 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 100 శాతం పన్ను ల వసూళ్లే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గడిచిన రెండు నెలలు పలు సర్వే ల్లో పాల్గొన్న సిబ్బంది, ప్రస్తుతం మార్చి నెలాఖరులోగా సాధ్యమైనంత ట్యాక్స్ వసూలు చేయాలన్న టార్గెట్తో ముందుకెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని నియమించారు. ప్రతి రోజూ ఉదయం ఎనిమిది గంటలకే కాలనీల్లోకి వెళ్లి పన్నులు చెల్లించాలని భవనాల యజమానులను కోరుతున్నారు. కార్పొరేషన్లో విలీనమైన నస్పూ రు మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామపంచాయతీల విలీన ప్రక్రియ పూర్తయినప్పటికీ అందుకు సంబంధించిన వివరాలు కార్పొరేషన్ సైట్లో కనిపించడంలేదు.
దీంతో వసూలు చేయాల్సిన ల క్ష్యంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నా రు. ఇప్పటికైతే మంచిర్యాల మున్సిపాలిటీలోని 36 వార్డుల్లోనే పన్నులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే 40మందికి పైగా మొండి బ కాయిదారులకు రెడ్నోటీసులు అందించారు. నిత్యం ఇంటింటికీ చెత్తను సేకరించే వాహనాలకు అమర్చి ఉన్న మైకుల్లో ఆస్తిపన్ను చెల్లించాలంటూ ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఆస్తిపన్ను చెల్లించాలంటూ బ్యానర్లు ఏర్పాటుచేశారు. విలీన ము న్సిపల్, గ్రామపంచాయతీలకు సంబంధించిన సిబ్బందిని కూడా వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లతో కలిపి వసూళ్లకు పంపుతున్నారు.
కార్పొరేషన్ పరిధిలో 45327 భవనాలు
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 45327 భవనాలు ఉన్నాయి. వీటిలో 41479 నివాస భవనాలు, 1977 కమర్షియల్ భవనాలు, 1871 మిక్స్డ్ ఉపయోగిత భవనాలు ఉన్నా యి. వీటిమీద ఈ ఏడాదిరూ. 16.47 కోట్ల ఆస్తిపన్ను రావాల్సి ఉంది. ప్రస్తుత పన్నుపై జ రిమానా రూ. 86.44లక్షలు, పాతబకాయిలు రూ. 5.52 కోట్లు, పాతబకాయిలపై జరిమా నా రూ.3.16లక్షలు కలుపుకుని మొత్తం రూ. 26.02 కోట్లు వసూలు చేయడం లక్ష్యంగా ఉంది. ఇందులో నుంచి ఇప్పటివరకు రూ. 10.03కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ. 15.99 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్ప టి వరకు 38.55 శాతం ఆస్తిపన్ను మాత్రమే వసూలు చేసిన అధికారులు మార్చి నెలాఖరులోగా మిగిలిన మొత్తాన్ని వసూలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.