కుమ్రం భీం ఆసిఫాబాద్ : యువతి ప్రేమకు ఒప్పుకోలేదని గొంతుకోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండలంలో పెందూర్ అఖిల్ అనే యువకుడు లైవ్‌లో తన గొంతును కోసుకొని వీడియోను ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు. అతని ఫ్రెండ్స్ ద్వారా రెండు నిమిషాల్లోనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పది నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ యువకుణ్ని వాంకిడి ఎస్సై దీకొండ రమేష్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు.